SRD: పటాన్చెరు నియోజకవర్గ బీరంగూడ డివిజన్లో బుధవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌ను అమీన్ పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీరంగూడ ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్‌ను స్వీపింగ్ చేసి, అక్కడి చెత్తను పూర్తిగా ఎత్తివేశారు.