VSP: జిల్లాలో మద్యం అమ్మకాల జోరు కొనసాగుతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు మద్యం అమ్మకాల ద్వారా రూ.1,940 కోట్ల ఆదాయం సమకూరినట్లు విశాఖ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ R. ప్రసాద్ తెలిపారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 1.74 శాతం ఎక్కువన్నారు. డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు రూ.146 కోట్ల మద్యం విక్రయాలు జరగగా, రోజుకు సగటున రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నయని ఆయన తెలిపారు.