CTR: సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరులో ఇటీవల పలు ప్రాంతాలలో సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వాటిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య దర్యాప్తు ప్రారంభించారు. ఓబనపల్లె కాలనీకి చెందిన రాజేష్, లోకేష్, రాకేష్ అనే ముగ్గురిని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వద్ద అరెస్టు చేశారు.