Samantha: వరుణ్ ధావన్ తో కలిసి పబ్ లో స్టెప్పులేసిన సమంత..!
టాలీవుడ్ హీరీయిన్ సమంత కెరీర్ లో దూసుకుపోతోంది. ది ఫ్యామిలీ మేన్ సిరీస్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ తో సమంత హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాబోతున్న మరో సిరీస్ ‘‘సిటాడెల్’’ తో మరింత అలరించేందుకు కృషి చేస్తోంది.
వెబ్ సిరీస్ (Webseries)లకు ముందు సమంత(samantha) తన విడాకుల తర్వాత వెంటనే పుష్ప సినిమాలో ఊ అంటావా, ఊహూ అంటావా పాటకు డ్యాన్స్ వేసి అందరికీ షాకిచ్చింది. కానీ, ఆ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ పాటతో సమంత క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. తనకు అంత క్రేజ్ ఇచ్చిన ఈ పాటకు సమంత తాజాగా మరోసారి స్టెప్పులేసింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్ షూటింగ్ లో సమంత ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ షూటింగ్ ప్రస్తుతం సైబీరియాలో జరుగుతోంది. దానికోసం అక్కడకు వెళ్లిన ఆమె చిత్ర బృందంతో కలిసి అక్కడకు పబ్ కి వెళ్లింది. ఆ పబ్ లో ఆమె ఊ అంటావా, ఊహూ అంటావా పాటకు వరుణ్ ధావన్ తో కలిసి ఆమె స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా, సమంత(samantha) చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. మరిన్ని హాలీవుడ్ ప్రాజెక్టులను కూడా ఆమె ఒకే చేస్తుందని తెలుస్తోంది. దాని కోసం ఆడిషన్స్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్లో, సాధారణంగా పెద్ద దర్శకులు, నిర్మాణ సంస్థలు స్టార్ నటులను కూడా నిర్దిష్ట పాత్ర కోసం ఆడిషన్ టేపులను పంపమని అడుగుతారు. సమంత కూడా ఆడిషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మరోవైపు సమంత ఖుషీ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.