తన ఫిట్నెస్కు సంబంధించిన రహస్యాన్ని కింగ్ నాగార్జున రివీల్ చేశారు. గత 45ఏళ్లుగా ఒక్కరోజు కూడా వ్యాయామం చేయడం మానలేదని తెలిపారు. తాను ఎప్పుడూ డైటింగ్ చేయలేదని, వేళకు తింటానని చెప్పారు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా సానుకూలంగా ఆలోచించడమే తన ఆరోగ్యానికి, నిత్య యవ్వనానికి ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు