TG: గోదావరి-బనకచర్ల విషయంలో ప్రభుత్వాన్ని నిద్రలేపింది తామేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బనకచర్ల విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి వెళ్లొద్దని రేవంత్ రెడ్డికి సూచించామన్నారు. కానీ రేవంత్ రెడ్డి మీటింగ్కు వెళ్లి సంతకం చేశారని విమర్శించారు. కేంద్ర జలవనరుల శాఖ సమావేశం అజెండాలో గోదావరి-బనకచర్ల అంశం ఉందన్నారు.