WNP: యాసంగి సీజన్లో జిల్లాలో సుమారు 2,32,000 ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని వనపర్తి ఇంఛార్జ్ వ్యవసాయ అధికారి దామోదర్ తెలిపారు. ప్రస్తుతం రైతులకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలోని 169 సేల్ పాయింట్ల ద్వారా సరఫరా జరుగుతుందని, రానున్న మూడు నెలలకు దశలవారీగా 18,475 టన్నుల యూరియా రానున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.