సత్యసాయి: పెనుకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మహాత్మా గాంధీ గురుకుల పాఠశాల, గిరిజన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ మోడల్ పేపర్స్ పంపిణీ చేశారు. యూటీఎఫ్ సీనియర్ నాయకులు సుధాకర్, నారాయణ స్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా మోడల్ పేపర్స్ పంపిణీ చేశారు. మోడల్ పేపర్స్ బాగా చదివి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు.