MBNR: మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి కోనేరు వద్ద మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం అయ్యప్ప స్వామికి పాలాభిషేకం చేశారు. అనంతరం కృష్ణుడు, ఆంజనేయస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటారు.