NLG: జిల్లాలో తప్పిపోయి, వెట్టి చాకిరీకి గురవుతున్న బాలబాలికలను రక్షించేందుకు జనవరి 1నుంచి 31వరకు “ఆపరేషన్ స్మైల్ – XII” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రత్యేక బృందాలతో బస్టాండ్లు, హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపడతామని చెప్పారు. జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.