KMM: ఖమ్మం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై వేడుకలు నిషేధించబడ్డాయని కమిషనర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలను నడపవద్దని, మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులను క్షోభకు గురిచేయవద్దన్నారు.