MNCL: రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆసక్తిని చూపాలని వ్యవసాయ శాఖ ఏడిఏ కృష్ణ కోరారు. మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని సూరారం గ్రామ శివారులో వివిధ పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. రైతులు వరికి బదులు నువ్వులు, మొక్కజొన్న, ఆయిల్ ఫాం తోటల సాగుపై ఆసక్తిని చూపాలన్నారు. మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.