ADB: జిల్లా పరిధిలో చైనా మాంజాపై పూర్తిగా నిషేధం ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో చైనా మాంజాపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఇప్పటివరకు జిల్లాలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.