Jharkhand News:స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. అయినా జార్ఖండ్(Jharkhand)లోని హజారీబాగ్ జిల్లా ఇచాక్ బ్లాక్‌లోని దాదీ ఘఘర్ పంచాయతీ పరిధిలోని పురాన్పానియా గ్రామం(Puranpaniya village)లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. గ్రామానికి వెళ్లడానికి రహదారి లేదు. గ్రామస్తులు దట్టమైన అటవీ మార్గాల గుండా నడవాలి. ఒక వైపు ప్రభుత్వం గ్రామం నుండి నగరానికి రోడ్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతోంది.. మరోవైపు హజారీబాగ్ జిల్లా ఇచాక్ బ్లాక్‌లోని పురాన్పానియా గ్రామంలో రోడ్డు లేక ప్రజలు నానావస్థలు పడాల్సి వస్తోంది.
రహదారి లేకపోవడంతో పురాన్పానియా గ్రామానికి చెందిన సురేంద్ర కిస్కు భార్య మున్నీదేవి ప్రసవ నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్లడానికి కాలినడకన 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వచ్చింది. ఆసుపత్రి అంబులెన్స్ రహదారి లేకపోవడంతో గ్రామానికి చేరుకోలేకపోయింది. 4 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించిన గర్భిణి మున్నీ దేవి మమత వాహనం సహాయంతో ఇచాక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
రోడ్డు లేకపోవడంతో పురాన్‌పునియా గ్రామ ప్రజలు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారిని కాలినడకన గానీ, డోలీ కట్టి గానీ, మంచంపై ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకువెళ్తుంటారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా పురాన్‌పునియా గ్రామ ప్రజలు , ఇప్పటి వరకు కనీస సౌకర్యాల పేరుతో గ్రామంలో రోడ్డు, కరెంటు, తాగునీరు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నా, ఎన్నికల్లో గెలిచి ఇప్పటి వరకు పురాన్‌పునియా గ్రామ ప్రాథమిక సమస్య పరిష్కారానికి ఏ ప్రభుత్వంగానీ, ప్రజాప్రతినిధిగానీ చర్యలు తీసుకోలేదు.