జనతా గ్యారేజ్, దేవరాయ, అత్తిలి సత్తిబాబు వంటి సినిమాల్లో నటించిన విదిషా శ్రీవాస్తవ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె తన బేబీ బంప్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవికాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు వెండితెరపై మెరిసిన నటి విదిషా శ్రీవాస్తవ(Actress Vidisha Srivastava) తల్లికాబోతోంది. ఈ ముద్దుగుమ్మ హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్(Hindi Serials)లో నటించింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో సందడి చేసింది. ప్రస్తుతం ఆమె తన బేబీ బంప్స్ ఫోటోల(Baby Bumps Photos)ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా వైరల్(photos Viral) అవుతున్నాయి. విదిషా మొదటగా ‘బాబీజీ ఘర్ పర్ హైన్’ అనే సీరియల్లో నటించింది. ఆ సీరియల్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ(Cine Industry)లోకి అడుగుపెట్టింది.
తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం సినిమాల్లోనూ విదిషా శ్రీవాస్తవ(Actress Vidisha Srivastava) కనిపించింది. ‘మా ఇద్దరి మధ్య’ అనే సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్(Tollywood)లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘అలా’ అనే సినిమాలో నటించింది. అల్లరి నరేష్(Allari Naresh)తో ‘అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ’, శ్రీకాంత్(srikanth)తో ‘దేవరాయ’ సినిమాల్లో నటించి మెప్పించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సినిమా ‘జనతా గ్యారేజ్'(Janatha garrage)లోనూ విదిషా(Actress Vidisha Srivastava) కీలక పాత్రలో కనిపించింది. ఆ సినిమాలో ఉన్ని ముకుందన్ భార్యగా నటించింది. 2018లో సాయక్ పాల్‌తో విదిషాకు వివాహం అయ్యింది. జులైలో తన బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె బేబీ బంప్స్ ఫోటోలు(Baby Bumps Photos Viral) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.