»Ed Issued Summons To Jharkhand Minister Alamgir Alam To Appear On 14th May 2024
ED Summons : జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలంకు ఈడీ సమన్లు.. మే 14న విచారణ
కాంగ్రెస్ ఎమ్మెల్యే, జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం సమన్లు జారీ చేసింది. మే 14న రాంచీలోని తన కార్యాలయంలో ఈడీ అతడిని విచారణకు పిలిచింది.
ED Summons : కాంగ్రెస్ ఎమ్మెల్యే, జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం సమన్లు జారీ చేసింది. మే 14న రాంచీలోని తన కార్యాలయంలో ఈడీ అతడిని విచారణకు పిలిచింది. అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి నివాస ప్రాంగణంలో కోట్లాది రూపాయల రికవరీకి సంబంధించి మంత్రికి సమన్లు వచ్చినట్లు సమాచారం. అలంగీర్ ఆలం పీఏ సంజీవ్ లాల్ సేవకుడు జహంగీర్ ఆలం దాచిన స్థలాల నుంచి రూ.35 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సంజీవ్ లాల్, జహంగీర్ ఆలంలను ఈడీ అరెస్ట్ చేసింది.
మే 6న అలంగీర్ ఆలం పీఏ సంజీవ్ లాల్ ఇంటి పని మనిషి జహంగీర్ ఆలం ఫ్లాట్‌పై ఈడీ దాడి చేసి, 37 కోట్ల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు. రాంచీలోని పలు చోట్ల దర్యాప్తు సంస్థ జరిపిన దాడుల్లో భాగంగానే నగదు రికవరీ జరిగింది. లెక్కల్లో చూపని నగదును లెక్కించేందుకు పలు కౌంటింగ్ యంత్రాలను తెప్పించారు. ఇది కాకుండా, ఏజెన్సీ అధికారులు జహంగీర్ ఆలం ఫ్లాట్ నుండి కొన్ని ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో విచారణ
70 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలం జార్ఖండ్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో పాకుర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది అరెస్టయిన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్‌పై మనీలాండరింగ్ కేసులో కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ దాడి జరిగింది. డిపార్ట్మెంట్లోని కొన్ని పథకాల అమలులో అక్రమాలకు సంబంధించింది.