»Jharkhand New Cm Oath Taking Ceremony Champai Soren
Jharkhand : జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్.. హైదరాబాద్ కు ఎమ్మెల్యేలు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన చంపై సోరెన్ శుక్రవారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు అలంగీర్ ఆలం, సత్యానంద్ భోక్తా కూడా ప్రమాణస్వీకారం చేశారు.
Jharkhand : రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన చంపై సోరెన్ శుక్రవారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు అలంగీర్ ఆలం, సత్యానంద్ భోక్తా కూడా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీలో ఎలాంటి చీలిక రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హైదరాబాద్‌కు పంపినట్లు సమాచారం. ఫిబ్రవరి 5న ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ చంపై సోరెన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించారు. రాజ్‌భవన్‌లోని దర్బల్ హాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన వెంటనే చంపై సోరెన్ బుధవారం నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గురువారం రోజంతా గందరగోళం నెలకొంది.
దాదాపు 4 ఏళ్ల పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమంత్ సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ముదిరింది. సోరెన్ తన భార్య కల్పనా సోరెన్‌కు అధికార పగ్గాలు అప్పగిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇది జరగలేదు.
ఆలంగీర్ ఆలం ఎవరు?
2000 సంవత్సరంలో అవిభక్త బీహార్‌లోని రబ్రీ దేవి ప్రభుత్వంలో అలంగీర్ ఆలం తొలిసారిగా చేనేత శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ వరకు ఆయన ప్రయాణం సాగించారు. 2000, 2005, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మధు కోడా ప్రభుత్వంలో రెండేళ్లు అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగారు. 2014 – 2019 ఎన్నికల తరువాత, అతను జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా నియమించబడ్డాడు.
కాగా ఆర్జేడీకి చెందిన సత్యానంద్ భోక్తా చత్రా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జార్ఖండ్‌లో మూడుసార్లు మంత్రి అయ్యారు. చంపై సోరెన్ క్యాబినెట్‌కు ముందు, అతను హేమంత్ సోరెన్, అర్జున్ ముండా క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. సత్యానంద్ భోక్తా భారతీయ జనతా పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2000, 2004లో బీజేపీ టికెట్‌పై ఎన్నికయ్యారు. 2019లో ఆర్జేడీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హేమంత్ సోరెన్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సత్యానంద్ భోక్తా చత్రా జిల్లా సదర్ బ్లాక్‌లోని కారి గ్రామ నివాసి.
ఫిబ్రవరి 5న ఫ్లోర్ టెస్ట్
10 రోజుల్లో కొత్త ప్రభుత్వం మెజారిటీని నిరూపిస్తుందని జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ అన్నారు. మరో సమాచారం ప్రకారం ఫిబ్రవరి 5న ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. కాంగ్రెస్, జేఎంఎం, రాష్ట్రీయ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేల విడిపోవడంపై కూడా ఊహాగానాలు వచ్చాయి. దీనిపై చంపై సోరెన్ మాట్లాడుతూ, మేం ఐక్యంగా ఉన్నామని, మా కూటమి బలంగా ఉందని, మమ్మల్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని అన్నారు.
ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంత మంది?
గిరిజన నాయకుడు చంపాయ్ సోరెన్ జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రి అయ్యారు. 23 ఏళ్ల ప్రయాణంలో జార్ఖండ్ ఇప్పటివరకు 11 మంది ముఖ్యమంత్రులను చూసింది. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో జేఎంఎంకు చెందిన 29 మంది, కాంగ్రెస్‌కు చెందిన 17 మంది, ఆర్జేడీకి చెందిన 1 సభ్యుడు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి 26 మంది ఎమ్మెల్యేలు, ఏజేఎస్యూకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కాకుండా ఇద్దరు సభ్యులు స్వతంత్రులు కాగా, ఎన్సీపీ, సీపీఐ-ఎంఎల్‌లకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు.