NRPT: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్కి చెందిన శివలింగప్ప కుమారుడు నరేష్ శస్త్రచికిత్స కోసం ఆర్థిక సాయం అర్థించగా మంత్రి స్పందించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.4 లక్షల విలువైన LOCని మంజూరు చేయించి, మక్తల్లో బాధితుడి కుటుంబానికి అందించారు.