NLG: సకాలంలో వైద్య సిబ్బంది స్పందించకపోవడం వల్ల వ్యక్తి మృతి చెందాడని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన గడ్డం సత్తిరెడ్డి చాతిలో నొప్పి వస్తుందని సోమవారం రాత్రి నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో చేరగా ఈసీజీ తీసి బానే ఉందని చెప్పారని, వైద్యం ఆలస్యం వల్లే అంతలోనే వాంతులు చేసుకొని మృతి చెందాడని ఆగ్రహం చెందారు.