ADB: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదన్నారు. డీజేలు పెట్టడం, ఇతరులను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 31న రాత్రి జిల్లాలో ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.