TG: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేశి సాధించిన విజయాలు దేశానికే గర్వకారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇరువురు కాంస్య పథకాలు సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో వీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.