SS: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హిందూపురం MP బీకే పార్థసారథి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్వదినం వేళ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.