కృష్ణా: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందినట్లు తెలిపారు. ఈ పవిత్ర దినాన దర్శనం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.