KNR: ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. హిమాయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో , పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలన్నారు.