NTR: ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని కలెక్టర్ డా. జీ లక్ష్మీశ స్పష్టం చేశారు. సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఆలయాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, ప్రసాదాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.