కృష్ణా: ఉంగుటూరు పోస్ట్‌ఆఫీసులో ఖాతాదారుల డబ్బును గోల్మాల్ చేసిన పోస్ట్‌మ్యాన్ కందవల్లి శేఖర్‌ను ఉంగుటూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఖాతాల్లో జమ చేయాల్సిన నగదును తన అవసరాలకు వినియోగించి, కొందరికి నకిలీ పాస్‌బుక్స్ ఇచ్చి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలరోజులుగా పరారీలో ఉన్న శేఖర్‌ను H.జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.