MBNR: మిడ్జిల్ మండలంలోని వల్లభురావుపల్లి గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ రికార్డులను ఏఈ రవితేజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వాటర్ ఇన్‌ప్లో, అవుట్ ఫ్లో, కెపాసిటీనీ రోజువారీగా రికార్డులలో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.