అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనికా రెడ్డితో మార్చి 6న పెళ్లి జరగనుందని ప్రకటించాడు. విశేషం ఏంటంటే.. అన్నయ్య అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా అదే. దీనిపై శిరీష్ స్పందిస్తూ.. ‘వెన్యూ ఖాళీని బట్టి ఈ డేట్ ఫిక్స్ చేశాం. అన్నయ్య పెళ్లి రోజే నా పెళ్లి జరగడం యాదృచ్ఛికమే అయినా.. ఒక బ్లెస్సింగ్గా భావిస్తున్నా’ అని చెప్పాడు. అన్నయ్య, వదినలే తనకు స్ఫూర్తి అని తెలిపాడు.