కరీంనగర్‌లోని ఓపెన్ జిమ్‌లకు తక్షణమే మరమ్మతులు చేయించాలని కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ సోమవారం ‘ప్రజావాణి’లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రూ. 3.60 కోట్లతో ఏర్పాటు చేసిన 30 జిమ్‌ల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. వ్యాయామ పరికరాలు చెడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.