AP: ఎలమంచిలి వద్ద జరిగిన రైలు ప్రమాదం ఘటనా స్థలానికి విజయవాడ డీఆర్ఎం మోహిత్ చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రమాదంలో ఒక ప్రయాణికుడు సజీవదహనం అయ్యారని, మృతుడు విశాఖకు చెందిన చంద్రశేఖర్(70)గా గుర్తించామన్నారు. B1లోనే మంటలు చెలరేగిట్లుగా తెలుస్తోందని, ఏసీ కోచ్ కావడంతో దుప్పట్లకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయని తెలిపారు.