అనిల్ రావిపూడి పటాస్ మూవీతో డైరెక్టర్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే పటాస్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ కంటే ముందుగా రామ్ పోతినేనిని హీరోగా అనుకున్నట్లు ఆయన ఇటీవల వెల్లడించారు. అయితే ఆ టైంలో పోలీసుగా చేయాలా అనే సందిగ్ధంలో ఆయన ఆగిపోయినట్లు తెలిపారు. కథ వినగానే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రామ్ చెప్పినట్లు పేర్కొన్నారు.