తిరువనంతపురంలో జరిగిన 4వ T20లో శ్రీలంకపై భారత్ 30 రన్స్ తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 191/5 స్కోరుకే పరిమితమైంది. లంక బ్యాటర్లలో చమరి(52) పరుగులతో రాణించగా.. భారత్ తరఫున వైష్ణవి, అరుంధతి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత ఓపెనర్లు స్మృతి 80, షెఫాలీ 79 పరుగులతో రాణించగా.. చివర్లో రిచా( 16 బంతుల్లో 40*) రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే.