SS: ముక్కోటి ఏకాదశి సందర్భంగా కదిరిలో ఈ నెల 29 రాత్రి 8 గంటల నుంచి 30 సాయంత్రం 5 గంటల వరకు వాహనాల మళ్లింపు అమలు చేస్తామని టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. లక్ష మందికి పైగా భక్తులు రానుండటంతో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. జీమాను సర్కిల్ నుంచి శివాలయం వరకు మాత్రమే VIP వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. మూడు ఉచిత క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.