కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో నరేందుల నరసవ్వ అనే వృద్ధురాలిని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముద్రబోయిన కుమార్ అనే వ్యక్తి హత్య చేసి, ఆమె చెవులకు ఉన్న కమ్మలను దోచుకెళ్లాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.