KRNL: ఎం.కొట్టాలలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర సెక్రటరీ బుసినే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం యువజన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామ,మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.