ASF: చలి తీవ్రత పెరగడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని పాఠశాలల సమయాల్లో మార్పు చేసినట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేస్తుండగా.. ఇప్పుడు ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మార్పు చేశారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.