NLG: మిర్యాలగూడ మినీ రవీంద్రభారతిలో తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు అన్నభీమోజు ఆచారి జీవిత విశేషాలతో కూడిన పుస్తకావిష్కరణ సభ ఆదివారం జరిగింది. సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ గౌరిశంకర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని, డైరీని ఆవిష్కరించారు.