NLG: దేశంలో బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.