ADB: వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఉన్న రికార్డులను పూర్తిగా పరిశీలించి కేసుల స్థితిగతులను తెలుసుకున్నారు. స్టేషన్కు వచ్చిన ఎస్పీకి సిబ్బంది పోలీస్ గౌరవ వందనాన్ని అందజేశారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా పూర్తి చేయాలని సూచించారు.