శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్లు షఫాలీ వర్మ (79), స్మృతి మంధాన (80) మెరుపు అర్ధశతకాలతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో రిచా ఘోష్ కూడా 16 బంతుల్లోనే 40 పరుగులతో మెరుపులు మెరిపించింది. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 221/2 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లంక బౌలర్లలో షెహానీ, నిమాషా తలో వికెట్ పడగొట్టారు.
Tags :