KMR: భిక్కనూర్ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందే దయాకర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.