HYD: జనవరి ఒకటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు.