SDPT: ఆర్థిక చేయూత ఫౌండేషన్ ప్రారంభం అయ్యి నేటికి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. నేటికి 100 కుటుంబాలకు పైగా ఆర్థిక సహాయం చేశామని రానున్న రోజుల్లో అనేక నిరుపేద కుటుంబాలకు, అనాథలకు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.