కృష్ణా: కోడూరు-అవనిగడ్డ ప్రధాన పంట కాలువలో సుమారు 25 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై చాణిక్య తెలిపారు. ఆదివారం మాచవరం గ్రామం వద్ద కాలువలో కొట్టుకొచ్చిన ఈ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు. వ్యక్తి వివరాలు తెలిసిన వారు కోడూరు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు.