టీమిండియా స్టార్ మహిళా ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంది. దీంతో భారత్ తరఫున మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా నిలిచింది. ఓవరాల్గా మహిళా క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని అందుకున్న నాలుగో క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కింది.