MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదివారం తెలిపారు. అధికారులతో జరిగిన సమీక్షలో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సమస్యలపై చర్చించారు. మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.