PLD: గణపవరం చెక్ పోస్ట్ వద్ద ఆదివారం నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై మరియు వాహనాలకు నంబర్ ప్లేట్లు లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.