KMR: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ ప్రాముఖ్ రేంజర్ల నరేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు శంషాబాద్లో మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్ గిరి, స్వామి, అనిల్, పాల్గొన్నారు.