NZB: జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలిచిన మున్నూరు కాపు సర్పంచ్లను సన్మానించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా మున్నూరుకాపు సంఘంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమం ఉంటుందని సంజయ్ తెలిపారు.