BDK: రానున్న రెండు రోజుల పాటు భద్రాద్రి జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా జిల్లా వ్యాప్తంగా శీతల గాలుల ప్రభావం, పొగ మంచు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇవాళ తెలిపారు.